: 'మా వాళ్లను మాకిచ్చేయండి' అంటూ ఏపీ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ధర్నా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం ఏపీలో ఉండిపోయిన తెలంగాణ ఉద్యోగులను తక్షణం రిలీవ్ చేయాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేపట్టాయి. హైదరాబాద్ లోని అన్ని ఏపీ కార్యాలయాలూ, ఉద్యోగులూ అమరావతి ప్రాంతానికి తరలిపోతున్న వేళ, ఏపీ సెక్రటేరియట్ లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ సెక్రటేరియట్ కు పంపాలని నిరసనలు మిన్నంటాయి. ప్రస్తుతం ఏపీ సచివాలయం భవనం ముందు తెలంగాణ ఉద్యోగ సంఘాలు ధర్నా చేస్తున్నాయి. ఏపీ సచివాలయంలో 234 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్న తెలంగాణ నేటివ్ గా ఉన్న వారున్నారని, వారందరినీ రిలీవ్ చేసి తమ సచివాలయానికి పంపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. కాగా, తెలంగాణ నేటివ్ గా ఉన్న పలువురు ఉద్యోగులు ఏపీలో పనిచేసేందుకు ఆసక్తిని చూపక, అక్కడికి వెళ్లని సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News