: వింతల్లోకెల్లా వింత!... ఇస్తాంబుల్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన పాకిస్థాన్!


ఓ వైపు పాకిస్థాన్ భూభాగంపై స్వేచ్ఛగా తిరుగుతున్న ఉగ్రవాదులు భారత్ పై విధ్వంసానికి దిగుతున్నారు. 2008లో ముంబైలో మారణ హోమం, మొన్నటి పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి, తాజాగా పాంపోర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడులకు... రూపకల్పన పాక్ గడ్డపైనే జరిగింది. అంతేకాకుండా ఆ దేశానికి చెందిన ఉగ్రవాదులనే భారత్ లోకి పంపిన ఉగ్రవాద నేతలు పెను విధ్వంసాలకు పాల్పడ్డారు. తాజాగా నేటి ఉదయం టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఐఎస్ ముష్కరులు విరుచుకుపడ్డారు. 36 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులు వందకు పైగా అమాయక ప్రయాణికులను గాయాలపాల్జేశారు. ఈ నేపథ్యంలో ఎవ్వరూ ఊహించని విధంగా ఈ దాడిని పాక్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. గాయపడ్డ వారు వీలయినంత త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’’ అని ఆ ప్రకటనలో పాక్ పేర్కొంది.

  • Loading...

More Telugu News