: పేలుళ్ల సమయంలో ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో హృతిక్ రోషన్, తృటిలో తప్పించుకున్న హీరో


టర్కీ లోని ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి నుంచి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తృటిలో తప్పించుకున్నాడు. ముగ్గురు ముష్కరులు దాడి చేసిన విషయం తనకు షాక్ ను కలిగించిందని తెలిపాడు. దాడి నుంచి తృటిలో తప్పించుకున్నామని చెప్పాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు. ఇస్తాంబుల్ విమానాశ్రయంలోని కొందరు ఉద్యోగులు మంచి మనసుతో తమకు సహాయం చేశారని తెలిపాడు. మతం కోసం అమాయకులను దారుణంగా చంపారని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐకమత్యం చూపాలని చెప్పాడు. తమ టీమ్ క్షేమమేనని వివరించాడు. దాడికి కొద్ది సేపటి ముందు ఆయన ఇండియాకు ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయింది. ఆయన ప్రయాణించాల్సిన ఓ విమానం రద్దు కాగా, మరో విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్లు లేకపోవడంతో, ఎకానమీ టికెట్లు కావాలని హృతిక్ కోరగా, అక్కడున్న అధికారులు ఇప్పించినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన దాడి నుంచి తప్పించుకోగలిగారు.

  • Loading...

More Telugu News