: నవ్యాంధ్రకు వస్తున్న స్మార్ట్ ఫోన్ సంస్థ; చంద్రబాబుకు హామీ ఇచ్చిన 'అప్పో'


చైనా కేంద్రంగా స్మార్ట్ ఫోన్ల విక్రయ సంస్థ అప్పో, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో మొబైల్ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రూ. 1000 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన అప్పో ప్రతినిధులు, తమ ప్లాంటులో 25 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబునాయుడు సంస్థ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్ వేర్ రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలను, ప్రపంచవ్యాప్తంగా డిమాండును ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయాలని కోరారు. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా నాలుగో రోజు బాబు బృందం చైనా పర్యటన బిజీగా సాగుతోంది.

  • Loading...

More Telugu News