: కేశినేని నాని క్షమాపణ చెప్పాలంటున్న వంగవీటి!... నేడు బెజవాడ బంద్ కు పిలుపునిచ్చిన వైసీపీ, కాంగ్రెస్!
టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని క్షమాపణ చెప్పాల్సిందేనని వైసీపీ యువ నేత, ఆ పార్టీ బెజవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో విజయవాడలో జన జీవనాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. నగరంలో రోడ్ల విస్తరణ పేరిట ఇటీవల అధికారులు పలు ఆలయాలను తొలగించారు. అధికారులను అడ్డుకున్న గోశాల నిర్వాహకులపై ఎంపీ హోదాలో ఉన్న నాని దుర్భాషలాడారట. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ, కాంగ్రెస్, హిందూ పరిరక్షణ సమితిలు నాని వైఖరికి నిరసనగా నేడు బెజవాడ బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంగా వంగవీటి రాధా... నాని క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.