: ‘మల్లన్న సాగర్’ ప్రాజెక్టును నిర్మించి తీరుతాం: మంత్రి హరీష్ రావు


మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించి తీరతామని మంత్రి హరీష్ రావు అన్నారు. తక్కువ ముంపు, ఎక్కువ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ‘మల్లన్నసాగర్’ ఒక్కటేనని, దీని సామర్థ్యం తగ్గించే ప్రసక్తే లేదని హరీశ్ స్పష్టం చేశారు. కాగా, మెదక్ జిల్లాలోని సదాశివపేటలో మైనార్టీ గురుకుల పాఠశాలను హరీష్ రావు ప్రారంభించారు. సంగారెడ్డిలో రెండు గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని, సాంప్రదాయ విద్యతో పాటు ఆంగ్ల విద్యను కూడా విద్యార్థులకు అందిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు.

  • Loading...

More Telugu News