: అన్నా డీఎంకే సభ్యత్వం స్వీకరించిన 12,000 మంది ఇతర పార్టీల కార్యకర్తలు


ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయ కేతనం ఎగురవేసిన అన్నా డీఎంకే పార్టీలో పలు పార్టీలకు చెందిన వేలాది మంది కార్యకర్తలు చేరారు. సీఎం జయలలిత సమక్షంలో వారందరూ అన్నాడీఎంకే పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డీఎంకే, డీఎండీకే, టీఎంసీ పార్టీలకు చెందిన సుమారు 12 వేల మంది కార్యకర్తలు అన్నాడీఎంకే సభ్యత్వం స్వీకరించారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ, తమ పార్టీలో చేరిన వారందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని, రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు పాటు పడుతున్నామని, అందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News