: పాకిస్థాన్ లో హిందూ జర్నలిస్టుపై వివక్ష ...ఎక్స్ ప్రెస్ ట్రిబ్యునల్ పత్రికలో కథనం


పాకిస్థాన్ ప్రభుత్వ వార్తా సంస్థ (ఏపీపీ)లో పనిచేసే ఒక హిందూ జర్నలిస్టు వివక్షకు గురవుతున్నాడు. అక్కడి వాళ్లు తాగే మంచినీటి గ్లాసులను, భోజనం ప్లేట్లను ఆయన్ని ముట్టుకోనీయకుండా చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యునల్ పత్రిక పేర్కొంది. ఏపీపీలో సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్న సాహిబ్ ఖాన్ ఓడ్ ను మొదట్లో సహోద్యోగులందరూ ముస్లిం మతస్థుడనే అనుకున్నారు. కానీ, సాహిబ్ ఖాన్ కొడుకు రాజ్ కుమార్ ఒకసారి ఆయన ఆఫీసుకు వెళ్లినప్పుడు సాహిబ్ ఖాన్ ముస్లిం కాదు, హిందూ అని తెలిసింది. అప్పటి నుంచి అతన్ని ట్రీట్ చేసే పద్ధతే మారిపోయిందని సాహిబ్ ఖాన్ పేర్కొన్నట్లు ఆ కథనంలో పేర్కొంది. తోటి ఉద్యోగులు ఉపయోగించే గ్లాసులను, ఇతర పాత్రలను వాడవద్దని ఏపీపీ బ్యూరో చీఫ్ తనకు చెప్పారని, ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో అందరితో కలిసి ఇఫ్తార్ విందులో కూడా పాల్గొననివ్వడం లేదని ఆయన చెప్పారని, తాను తాగే గ్లాసు, తినే కంచం ఇంటివద్ద నుంచే తెచ్చుకుంటున్నట్లు సాహిబ్ ఆవేదనతో చెప్పాడు. కాగా, ఈ విషయమై ఏపీపీ బ్యూరో చీఫ్ పర్వేజ్ అస్లాం వివరణ ఇస్తూ, సాహిబ్ కు ఫ్లూ జ్వరం కారణంగానే ఈ విధంగా చేయమని చెప్పాం తప్పా, ఇందులో ఎటువంటి అంటరానితనం, వివక్ష లేవంటూ సమర్థించుకునేందుకు ప్రయత్నించారు.

  • Loading...

More Telugu News