: ఎన్ఐఏ అధికారి హత్య కేసు ప్రధాన నిందితుడు మునీర్ అరెస్టు


గత ఏప్రిల్ లో ఉత్తరప్రదేశ్ లోని బిజ్ నూర్ సమీపంలో వివాహానికి హాజరై వస్తున్న ఎన్ఐఏ అధికారి తాంజిల్ అహ్మద్ ను కాల్చి చంపిన ప్రధాన నిందితుడు మునీర్ ను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇండియన్ ముజాహిదీన్ కేసులను పరిష్కరించడంలో సిద్ధహస్తుడైన తాంజిల్ అహ్మద్ కుటుంబంతో కలిసి వస్తుండగా అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన మునీర్ గ్యాంగ్ బుల్లెట్ల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 24 బుల్లెట్లు శరీరంలో దిగబడిన తాంజిల్ అక్కడికక్కడే మరణించగా, బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతూ పది రోజుల తరువాత ఆయన భార్య కూడా తనువు చాలించింది. అయితే, కారులో వెనుక సీట్ కింద దాక్కున్న తాంజిల్ అహ్మద్ పిల్లలు బతికిబట్టకట్టారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యూపీ ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ కు అప్పగించింది. దీంతో కొంత కాలంగా పరారీలో ఉన్న మునీర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, తాంజిల్ అహ్మద్ హత్య కేసుతో పాటు మరో రెండు హత్య కేసుల్లో కూడా మునీర్ ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News