: ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరిస్తున్న యువకుడి అరెస్టు


తనను ప్రేమించకపోతే యాసిడ్ పోస్తానని బెదిరించిన ఒక యువకుడిని ఖమ్మం జిల్లా అశ్వారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా నివాసముంటున్న ఒక యువతిని ప్రేమించమంటూ ఒక యువకుడు కొద్దిరోజులుగా వెంటపడుతున్నాడు. ఈ విషయమై ఆమె స్పందించకపోవడంతో యాసిడ్ దాడి చేస్తానని సదరు యువకుడు బెదిరించాడు. ఆ యువతి ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News