: విశాఖపట్టణం జిల్లాలో ఘర్షణ... పాల్మన్ పేటపై పడ్డ రాజయ్యపేట గ్రామస్థులు... పలువురికి గాయాలు!
విశాఖపట్టణం జిల్లాలోని పాయకరావుపేట మండలంలోని రెండు గ్రామాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. పంచాయతీపై పెత్తనం కోసం ఐదేళ్లుగా పాల్మన్ పేట, రాజయ్యపేట గ్రామాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో దగ్గర్లో జరిగిన ఓ సంతలో ఈ గ్రామాలకు చెందిన ఇద్దరు యువకుల మధ్య రేగిన ఘర్షణ వివాదానికి కారణమైంది. దీంతో రాజయ్యపేటకు చెందిన 250 మంది గ్రామస్థులు కత్తులు, ఇనుప రాడ్లు, కర్రలు పట్టుకుని పాల్మన్ పేట గ్రామంపై పడ్డారు. కొందరి ఇళ్లలోకి ప్రవేశించిన వీరు, కనిపించిన వారిని కనిపించినట్టు చితకబాదారు. దీంతో సుమారు 50 మందికి గాయాలు కాగా, ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. దీంతో గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు, అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. రాజయ్యపేటకు చెందిన 15 మందిని అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.