: వరంగల్ లో 8 మంది న్యాయవాదులపై కేసుల నమోదు
హైకోర్టు విభజన, న్యాయమూర్తుల నియామకం అంశాల్లో తెలంగాణకు న్యాయం చేయాలని న్యాయవాదులు పెద్దఎత్తున ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు న్యాయాధికారులను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఈరోజు ఉదయం వరంగల్ కోర్టు హాలులోకి న్యాయవాదులు చొచ్చుకు వెళ్లి, అక్కడి కుర్చీలు, బల్లలు విసిరేశారు. విధులను బహిష్కరించారు. దీంతో ఆందోళనలో పాల్గొన్న న్యాయవాదుల్లో ఎనిమిది మందిపై కేసు నమోదయింది. ఆస్తులు ధ్వంసం, విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై న్యాయవాదులపై కేసులు నమోదు చేశారు.