: తెలుగు రాష్ట్రాల సీఎంలతో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడతానన్నారు: దత్తాత్రేయ
తెలంగాణలో ఉద్రిక్తమవుతోన్న న్యాయవాదుల ఆందోళన అంశంపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కేంద్ర మంత్రి సదానంద గౌడతో భేటీ అయ్యారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. న్యాయాధికారుల సస్పెన్షన్ విషయాన్ని దత్తాత్రేయ రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రాజ్‌నాథ్ సింగ్ తనతో చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలతో రాజనాథ్ సింగ్ మాట్లాడతానన్నారని దత్తాత్రేయ చెప్పారు.