: కోడెల పనికిరాడు, తొలగించండి: భన్వర్ లాల్ కు సాక్ష్యాలందజేసిన వైకాపా నేతలు


ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరుగా కోడెల శివప్రసాద్ ఎంతమాత్రమూ పనికిరాడని, ఆయన్ను తక్షణం తొలగించాల్సిన అవసరం ఉందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ కు వైకాపా నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ మధ్యాహ్నం భన్వర్ లాల్ ను కలిసిన వైకాపా నేతలు, ఆయనపై అనర్హత వేటు వేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను రూ. 11.5 కోట్లు ఖర్చు పెట్టి గెలిచానని కోడెల స్వయంగా వ్యాఖ్యానించారని, దీనిపై విచారణ జరిపి కేసు పెట్టాలని కోరుతూ, ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను అందించారు. ఓ టీవీ చానల్ లో వచ్చిన ఆయన ఇంటర్వ్యూ సీడీని భన్వర్ లాల్ కు అందించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన ఆయన, స్పీకర్ పదవిని నిర్వహించేందుకు అనర్హుడని వివరించారు. దీనిపై స్పందించిన భన్వర్ లాల్, సీడీని పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు వైకాపా నేతలు తెలిపారు.

  • Loading...

More Telugu News