: టీమిండియా టెస్టులు, వన్డేల షెడ్యూల్ ఇలా సాగుతుంది...!


ఈ సీజన్ లో టీమిండియా షెడ్యూల్ ప్రకారం మన దేశంలో 13 టెస్టులు, 8 వన్డేలు, మూడు టీ-20 మ్యాచ్ లు ఆడనుంది. ఈ క్రమంలో తొలుత న్యూజిలాండ్ జట్టుతో 3 టెస్టులు, 5 వన్డేలు ఆడుతుంది. ఇందుకు సంబంధించిన మ్యాచ్ ల తేదీలు, వేదికల వివరాలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో ఉంచింది. వాటి వివరాలు... న్యూజిలాండ్ తో మొదటి టెస్టు మ్యాచ్- కాన్పూర్ లో సెప్టెంబరు 22 నుంచి 26 వరకు, రెండో టెస్ట్ మ్యాచ్- ఇండోర్ లో సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వ తేదీ వరకు, మూడో టెస్ట్ మ్యాచ్ - కోల్ కతాలో అక్టోబరు 8 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. వన్డే మ్యాచ్ ల విషయానికొస్తే, మొదటి వన్డే- ధర్మశాలలో అక్టోబరు 16న, రెండో వన్డే- ఢిల్లీలో అక్టోబరు 19న, మూడో వన్డే- మొహాలీలో అక్టోబరు 23న, నాలుగవ వన్డే- రాంచీలో అక్టోబరు 26న, ఐదో వన్డే- విశాఖపట్నంలో అక్టోబరు 29న జరుగుతాయి.

  • Loading...

More Telugu News