: మాట ఇచ్చిన మల్లాది విష్ణు ముఖం చాటేశారట!... రోడ్డెక్కిన ‘స్వర్ణ బార్’ బాధిత కుటుంబాలు


విజయవాడ కృష్ణలంకలో కార్యకలాపాలు సాగిస్తున్న స్వర్ణ బార్ లో కల్తీ మద్యం సేవించి చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డెక్కాయి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తల్లి పేరిట ఉన్న ఈ బార్ ను ఆయన తన సోదరుడి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారన్నది జగమెరిగిన సత్యం. 2015 డిసెంబర్ 7న ఉదయం సదరు బార్ లో మద్యం సేవించిన దినసరి కూలీలు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అక్కడి స్థానికులు స్పందించేలోగానే ఘోరం జరిగిపోయింది. నోటిలో నుంచి నురగలు కక్కుతూ పడిపోయినవారిలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆసుపత్రిలో చేరిన వారిలో చాలా మంది ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ ఘటన జరిగిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మల్లాది విష్ణు ఆ తర్వాత విజయవాడ వచ్చారు. ఆదుకుంటానని, చనిపోయినవారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పుల పరిహారం ఇస్తానని బాధితులకు హామీ ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా ఆ హామీని ఆయన అమలు చేయలేదట. దీంతో కొద్దిసేపటి క్రితం విజయవాడలో రోడ్డెక్కిన బాధితులు తక్షణమే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మల్లాది విష్ణు ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News