: హీరో నాని చాలా పాజిటివ్: హీరోయిన్ సురభి
హీరో నాని చాలా పాజిటివ్ దృక్పథంతో ఉంటాడని హీరోయిన్ సురభి కితాబు ఇచ్చింది. షూటింగులో నటన విషయంలో పలు సూచనలు చేస్తూ, తనలోని టాలెంట్ ను బయటకు వచ్చేలా చేశాడని ఆమె చెప్పింది. ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, జెంటిల్ మన్ చిత్రంలో తనకు అవకాశం లభించడానికి కారణమం నానీయేనని చెప్పింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సురభి, తాను చిత్ర రంగంలోకి ప్రవేశించాలనుకున్న విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు తనకెంతో సహకరించారని చెప్పింది. ‘బీరువా’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ తదితర చిత్రాల్లో నటించిన సురభి తాజా చిత్రం ‘జెంటిల్ మన్’.