: పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్న అభిమాని నిహారిక


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని మండలి నిహారిక తన అభిమాన నటుడి పేరును పచ్చబొట్టుగా పొడిపించుకుంది. పవన్ పేరును ఆమె పచ్చబొట్టుగా పొడిపించుకునేంత అభిమానానికి గల కారణాన్ని నిహారిక చెప్పింది. 20 ఏళ్ల వయస్సప్పుడు తన తల్లిదండ్రులు తనకు బలవంతపు పెళ్లి చేశారని, అయితే, భర్త పెట్టే హింసలు తట్టుకోలేక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డానని చెప్పింది. అయితే, సగం కాలిన గాయాలతో బతికిబయటపడ్డానని, ఆ తర్వాత తన లాంటి వారికి తాను ఇప్పుడు అండగా నిలుస్తూ అందరి మన్ననలు పొందుతున్నానన్నారు. పవన్ కల్యాణ్ ని స్ఫూర్తిగా తీసుకోవడం వల్లే ఇప్పుడు తాను ఇంత ఆదరణ పొందుతున్నానని నిహారిక చెప్పింది.

  • Loading...

More Telugu News