: ఆందోళనపై హైకోర్టు ఆగ్రహం.. ఇద్దరు న్యాయాధికారుల సస్పెన్షన్
ఆప్షన్ విధానాన్ని నిరసిస్తూ నిన్న హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహించిన తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు ఈరోజు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇద్దరు న్యాయాధికారులను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ వరప్రసాద్‌ను సస్పెండ్ చేసింది. ఆప్షన్ల విధానంపై వ్యతిరేకత తెలుపుతూ హైదరాబాద్‌లో ర్యాలీగా వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను న్యాయాధికారులు కలిసిన సంగతి తెలిసిందే. ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు.