: మేం ప్రాజెక్టులను వ్యతిరేకించడం లేదు, లోపాలను ఎత్తి చూపుతున్నాం: నాగం జనార్దన్ రెడ్డి
ప్రాజెక్టులను తాము వ్యతిరేకించడం లేదని, అందులోని లోపాలను ఎత్తి చూపుతున్నామని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మల్లన్న సాగర్ నిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం నష్టపరిహారం వర్తింపజేయాలని భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 123 జీవోతోనే ఎక్కువం లాభం ఉంటుందని చెబుతూ రైతులను ప్రభుత్వం మోసం చేయవద్దని ఆయన కోరారు.