: ముగిసిన వైఎస్ జగన్ ఫారిన్ టూర్!... సోషల్ మీడియాలో తిరిగొస్తున్న జగన్ ఫొటో!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. ఓ గంట క్రితం టూర్ ను ముగించుకుని బ్యాగేజీతో తిరిగివస్తున్న జగన్ ఫొటో... ఆయన ఫేస్ బుక్ అకౌంట్ లో దర్శనమిచ్చింది. కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన జగన్... అక్కడ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేసి సరదాగా ఎంజాయ్ చేశారు. గోల్ఫ్, చెస్, ఫుట్ బాల్ క్రీడలతో ఉల్లాసంగా గడిపిన ఆయన నేటి ఉదయం ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. విదేశీ పర్యటన ముగించుకుని సింపుల్ గా తన బ్యాగేజీని తానే పట్టుకుని వస్తున్న ఫొటోపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. విదేశీ పర్యటనను ముగించుకుని వస్తున్న జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికిన కొందరు నెటిజన్లు... ఆయన సింప్లిసిటీని కూడా ప్రస్తావించారు.