: రెండు ఆలయాల పుణ్యంతో నాకు సాహిత్యం అబ్బింది: పాటల రచయిత చంద్రబోస్


రెండు ఆలయాల పుణ్యంతో తనకు సాహిత్యం అబ్బిందని ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తమ ఇంటికి సమీపంలో ఒకటి శివాలయం, మరొకటి గ్రంథాలయం ఉండేవని, ఆ రెండింటికి తాను క్రమం తప్పకుండా వెళ్లటం వల్లే పాటల రచయితను కాగలిగానని చెప్పారు. తన తల్లి వ్యవసాయ కూలీగా, తన తండ్రి ఒక చిన్న పాఠశాలలో టీచర్ గా పనిచేసి సంపాదించిన డబ్బుతో తమ కుటుంబం గడిచేదన్నారు. తండ్రి అనారోగ్యం కారణంగా పోషణ భారమంతా తమ తల్లిపై పడటంతో, గుట్టుచప్పుడు కాకుండా తమ కుటుంబాన్ని ఆమె పోషించిందన్నారు. దీంతో, ఆకలి, బాధ, బాధ్యత, వేదన.. అన్నీ తెలిశాయని, జీవితపాఠాల ద్వారా నేర్చుకున్నవే ఈరోజు పాటలుగా రాస్తున్నానని చంద్రబోస్ అన్నారు.

  • Loading...

More Telugu News