: ధనిక రాష్ట్రమని చెప్పి ఛార్జీలు పెంచకుండా ఎలా ఉంటాం?: మంత్రి జగదీష్ రెడ్డి


తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పి అన్నీ ఉచితంగా ఇవ్వడం కుదరదని, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండా ఉండటం కుదరని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గుజరాత్ ధనిక రాష్ట్రమైనప్పటికీ ఛార్జీలు పెంచడం లేదా? ఛార్జీలు పెంచబోమని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. నిరంతర, నాణ్యమైన విద్యుత్ పంపిణీ కోసమే ఛార్జీలు పెంచామని, గ్రిడ్ లేకపోవడం వల్లే ఛత్తీస్ గఢ్ విద్యుత్ రావడంలో జాప్యం చోటుచేసుకుందని అన్నారు. డిసెంబర్ లోగా ఛత్తీస్ గఢ్ విద్యుత్ సాధిస్తామని అన్నారు. తెలంగాణలో జేఏసీ గురించి ఆయన ప్రస్తావిస్తూ, అసలు జేఏసీ అనేదే లేదని, ప్రొఫెసర్ కోదండరాం పాత్ర మారిపోయిందని జగదీష్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News