: కాకినాడలో రోడ్డు ప్రమాదంలో కొత్త జంట దుర్మరణం


రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నవజంట రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషాద సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చోటు చేసుకుంది. పట్టణంలోని బీచ్ రోడ్డులోని నేమామ్ గెస్ట్ హాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కొత్తపల్లికి చెందిన నరేష్(27), భాగ్యం(21) మృతి చెందారు. భార్య గర్భవతేమోనని తెలుసుకునే నిమిత్తం ఆమెను తీసుకుని నరేష్ తన బైక్ పై ఈరోజు ఆసుపత్రికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. దీంతో, వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.

  • Loading...

More Telugu News