: ముద్రగడను పరామర్శించిన సినీనటి హేమ
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను సినీనటి హేమ పరామర్శించింది. ఈరోజు ఉదయం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసానికి హేమ వెళ్లింది. ముద్రగడ, ఆయన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంది. కాగా, తుని ఘటనలో అరెస్టయిన కాపు కులస్తులను విడుదల చేయాలంటూ ముద్రగడ కుటుంబం ఇటీవల నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందేే.