: బీహార్ ఇంటర్ బోర్డు టాపర్ రుబీరాయ్ అరెస్టు
బీహార్ ఇంటర్ బోర్డు టాపర్ల కుంభకోణంలో 12వ తరగతి విద్యార్థిని రుబీరాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. బోర్డు ఫలితాల్లో టాప్ ర్యాంకర్ గా నిలిచిన రుబీ రాయ్... పొలిటికల్ సైన్స్ అనేది వంటలకు సంబంధించిన సబ్జెక్టని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో బీహార్ టాప్ ర్యాంకర్ల అసలు బండారం బయటపడింది. దీంతో టాప్ ర్యాంకులు సాధించిన మొత్తం 14 మంది విద్యార్థులకు బీహార్ ఇంటర్ బోర్డు మళ్లీ మౌఖిక పరీక్షలు నిర్వహించింది. అయితే, ఈ పరీక్షలకు రుబీరాయ్ హాజరు కాలేదు. దీంతో, ఆమెకు మరోసారి మౌఖిక పరీక్షలు నిర్వహించాల్సి వచ్చింది. ఈ పరీక్షలు పూర్తయిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు రుబీరాయ్ ను అదుపులోకి తీసుకున్నారు.