: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు బాంబు బెదిరింపు


సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో బాంబు పెట్టామంటూ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అయితే, స్టేషన్ లో బాంబులు ఉన్నట్లు వారి తనిఖీల్లో బయటపడకపోవడంతో, అది ఫేక్ ఫోన్ కాల్ గా గుర్తించారు. ఫోన్ చేసిన వ్యక్తిని అశోక్ గా గుర్తించిన రైల్వే పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News