: బీసీసీఐ పేరు మార్చేందుకు కసరత్తు


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) పేరును మార్చనున్నట్లు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. బోర్డుకు పెట్టబోయే కొత్తపేరును అభిమానులే సూచిస్తారని, దీనిపై త్వరలో ఆన్ లైన్ పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఇటీవల ధర్మశాలలో జరిగిన బోర్డు సభ్యుల సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులు, కోచ్ లు, సెలెక్టర్లు, పరిపాలనా విభాగానికి చెందిన ప్రతి ఒక్కరి క్షేమాన్ని బోర్డు కోరుకుంటుందని అన్నారు. క్రికెట్ బోర్డు ఎవరినీ నియంత్రించదని, బీసీసీఐ పేరులో ఉన్న కంట్రోల్ అనే పదాన్ని మార్చాలని చూస్తున్నామని, ఆ పదం స్థానే ‘కేర్’ అనే పదాన్ని పెట్టాలనుకుంటున్నామని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

  • Loading...

More Telugu News