: కూకట్‌పల్లిలో పాఠశాల భవనం పై నుంచి దూకి ఉపాధ్యాయుడి ఆత్మహత్య
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఓ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఒత్తిడిలో ఉన్న ఉపాధ్యాయుడు రాజు తాను పనిచేస్తోన్న ప్రైవేటు పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజు ఒక్కసారిగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా అలజడి సృష్టించింది. ఘటన పట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఉపాధ్యాయుడి ఆత్మహత్యకు గల కారణాలపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.