: రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ నేత‌లు.. తెలంగాణలో పెంచిన ఛార్జీల‌కు నిర‌స‌న‌


సామాన్యుడి బాధను అర్థం చేసుకోకుండా కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచేసిందని తెలంగాణ ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ క‌మిటీ (టీపీసీసీ) నేత‌లు హైద‌రాబాద్ లోని ఖైర‌తాబాద్ వద్దనున్న విద్యుత్ సౌధ కార్యాలయాన్ని శనివారం ముట్ట‌డించారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, శ్రీశైలం గౌడ్, ఇతర నేత‌లు, కార్య‌క‌ర్త‌లు విద్యుత్ సౌధ ముందు రోడ్డుపై బైఠాయించి నిర‌స‌న తెలిపారు. కాంగ్రెస్ నేత‌ల ఆందోళ‌న‌తో వాహనాల రాకపోకలకు కొంతసేపు అవాంతరం ఏర్పడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళ‌న‌కు దిగిన వారిని అరెస్టు చేశారు. మ‌రోవైపు ప‌లు జిల్లాల్లోనూ ఈరోజు టీపీసీసీ ధర్నాలు నిర్వ‌హిస్తోంది. ఆయా జిల్లాల్లో నిర్వ‌హిస్తున్న ఆందోళ‌న‌ల్లో కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పాల్గొంటున్నారు. సామాన్యుడిపై తెలంగాణ స‌ర్కార్ మోపుతున్న ఛార్జీల భారానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News