: కేసీఆర్ ముఖాన్ని ప్రజలు ఇంకెంతకాలం చూస్తారులే!: రేణుకా చౌదరి వ్యంగ్యాస్త్రాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్, మాజీ మంత్రి రేణుకాచౌదరి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎంతో క్రేజ్ ఉన్న బడా హీరోల సినిమాలే బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్న తరుణంలో కేసీఆర్ ముఖాన్ని ప్రజలు ఇంకెంత కాలం చూస్తారులే అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో పంచపాండవులు ఉంటే, టీఆర్ఎస్ గూటికి మాత్రం కౌరవులు చేరారని విమర్శించారు. కేసీఆర్ మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని... అంతిమ విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీయేనని రేణుకాచౌదరి అన్నారు.