: 'బ్రెగ్జిట్'... విడిపోయేందుకే ఓటర్ల తీర్పు; 171 చోట్ల ఫలితమిదే!
సంచలనం... యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాల్సిందేనని అత్యధిక ప్రజలు కోరుకుంటున్నారు. మొత్తం 383 కౌంటింగ్ ఏరియాల్లో ఇంతవరకూ 171 చోట్ల ఓట్ల లెక్కింపు పూర్తికాగా, 51.3 శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్ కు అనుకూలంగాను, 48.7 శాతం మంది వ్యతిరేకంగాను ఓట్లు వేసినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య పలు చోట్ల గట్టి పోటీ నెలకొని వున్నట్టు తెలుస్తోంది. పూర్తి ఫలితాలు కాసేపట్లో (11:30 గంటలకు) రానున్నాయి. తొలి ఫలితం సండర్లాండ్ నుంచి వెలువడగా, ఇక్కడ 82,394 మంది విడిపోవాలని, 51,930 మంది కలిసి కొనసాగాలని ఓట్లు వేశారు. ఈ ఫలితం ఆసియా స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపగా, అన్ని దేశాల ఈక్విటీలు నష్టాల్లో సాగుతున్నాయి.