: షారూక్ ఖాన్ కారుకు అడ్డుపడ్డ మహిళ.. !


బాలీవుడ్ అగ్రనటుడు షారూక్ ఖాన్ విలాసవంతమైన బీఎండబ్ల్యూ ఐ8 కారులో వెళుతుండగా ఆ వాహనానికి ఒక అభాగ్యురాలు అడ్డుపడింది. వెంటనే స్పందించిన షారూక్ బాడీగార్డులు ఆ మహిళను పక్కకు లాగేశారు. ఈ సంఘటన ముంబయి బాంద్రాలోని షారూక్ నివాసం ఎదుటే జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు షారూక్ కారు నడుపుతున్నాడా? లేక కారులో ఉన్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News