: ఎన్ఎస్ జీ లో భారత్ కు సభ్యత్వంపై కుదరని ఏకాభిప్రాయం
అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్ జీ)లో భారత్ కు సభ్యత్వం కల్పించే విషయమై ఏకాభిప్రాయం కుదరలేదు. భారత్ కు సభ్యత్వం ఇచ్చేందుకు చైనా సహా ఐర్లాండ్, టర్కీ, బ్రెజిల్, ఆస్ట్రియా, న్యూజిలాండ్ దేశాలు వ్యతిరేకించాయి. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై భారత్ సంతకం చేయనందుకే ఈ ఆరు సభ్య దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోపక్క, ఎన్ఎస్ జీలో భారత్ సభ్యత్వానికి మెక్సికో మద్దతు తెలిపింది.