: ఫేస్ బుక్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్... మీడియా సంస్థలతో ఒప్పందం!
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థలతో ఫేస్ బుక్ కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 336 కోట్ల 55 లక్షల విలువ చేసే 140 ఒప్పందాలపై సంతకం చేసినట్లు సమాచారం. మీడియాలో ప్రత్యక్ష ప్రసారాల వీడియోలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫేస్ బుక్ లైవ్ లో అందించేందుకు ఈ ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుందని, సీఎన్ఎన్, బజ్ ఫీడ్ మొదలైన సంస్థలకు ‘ఫేస్ బుక్’ అత్యధికంగా చెల్లించిందని తెలుస్తోంది.