: ఆ దొంగల ముఠా జగన్ వద్దకు చేరింది: టీడీపీ నేత సోమిరెడ్డి
నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పక్కన వుండి, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగల ముఠా ఇప్పుడు జగన్ వద్దకు చేరిందని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్సీపీ కారణంగానే కాపులు జైలుకెళ్లారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతల భాష తీరు మార్చుకోవాలని, చంద్రబాబు మోసగాడని భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు అండగా ఉందని, వైఎస్ హయాంలో 23 జిల్లాల్లో రూ.1100 కోట్లు రుణమాఫీ చేశారని.. చంద్రబాబు 13 జిల్లాల్లో రెండు విడతల్లో రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు.