: క్యూ కట్టిన ఓటర్లు... దూసుకుపోతున్న బ్రిటీష్ కంపెనీల ఈక్విటీలు


ఐరోపా కూటమిలో యూకే ఉండాలా? వద్దా? అన్న విషయమై నేడు రిఫరెండం జరుగుతుండగా, బ్రిటన్ స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తుందని, ఆపై ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగదని భావిస్తున్న ఇన్వెస్టర్ వర్గాలు ఈక్విటీల కొనుగోలుకు నడుం బిగించారని తెలుస్తోంది. ముఖ్యంగా గనుల రంగంలోని కంపెనీలు దూసుకెళుతున్నాయి. స్టాక్స్ 600, ఎఫ్టీఎస్ఈ 300 సూచికలు రెండు వారాల గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. టెస్కో అత్యధికంగా 1.9 శాతం లాభపడింది. ఎఫ్టీఎస్ఈ 100 సూచిక క్రితం ముగింపుతో పోలిస్తే అర శాతానికి పైగా వృద్ధిలో నిలిచింది. ఇక బ్రెగ్జిట్ కు అనుకూలంగా తీర్పు వస్తే, రేపటి సెషన్ లో స్టాక్ మార్కెట్లు 'బ్లడ్ బాత్'నే చూస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు బ్రిటన్ ఓటర్లు 300కు పైగా పోలింగ్ బూతుల ముందు క్యూ కట్టిన పరిస్థితి కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News