: విమానాశ్రయంలో ముఖం చాటేసి వెళ్లిపోయిన సల్మాన్ ఖాన్!
'సుల్తాన్' సినిమా షూటింగ్ ముగిసిన తరువాత తన పరిస్థితి అత్యాచారానికి గురైన మహిళలా ఉంటుందని వ్యాఖ్యానించిన బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ పై నిన్నటి హీరోయిన్ నగ్మా నుంచి నేటి తరం నటి కంగనా రౌనత్ వరకూ మండి పడుతున్న వేళ, ముంబై విమానాశ్రయంలో సల్లూ భాయ్ ముఖం చాటేసి వెళ్లిపోయాడు. సల్మాన్ ప్రయాణం గురించిన సమాచారం తెలుసుకున్న మీడియా పెద్దఎత్తున విమానాశ్రయం వద్దకు వెళ్లి, విమర్శలపై ప్రశ్నించేందుకు యత్నించగా, ఒక్క ముక్క కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. చుట్టూ పోలీసులు, సొంత బాడీగార్డుల మధ్య సల్మాన్ మీడియాను తప్పించుకుని వెళ్లడం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది.