: కేంద్ర కేబినెట్ భారీ ప్రక్షాళన!... స్వీయ నివేదికలివ్వాలని మంత్రులకు మోదీ ఆదేశం!


కేంద్ర కేబినెట్ ను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దాదాపుగా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోగానే కేబినెట్ ప్రక్షాళన తప్పనిసరి అన్న కోణంలో వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్లు ప్రధాని ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ సర్కారు రెండో బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి తమ పనితీరుకు సంబంధించి మంత్రులంతా స్వీయ నివేదికలు అందజేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 30న జరగనున్న భేటీకి నివేదికలతోనే రావాలని ఆ ఆదేశాల్లో ప్రధాని పేర్కొన్నట్లు సమాచారం. అంతేకాక సదరు సమావేశంలో మీ మీ శాఖకు చెందిన వ్యవహారాలపై ప్రజెంటేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని మంత్రులకు ప్రధాని సూచించారు. ఈ నివేదికలు, మంత్రుల ప్రజెంటేషన్లను పరిశీలించిన మీదట... కేబినెట్ లో ఎవరిని ఉంచుకోవాలి? ఎవరికి ఉద్వాసన పలకాలన్న విషయంపై ఓ నిర్ధారణకు రానున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News