: కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పిన బాలకృష్ణ


బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చెల్లించాల్సిన రుసుములను రద్దు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నట్టు సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. ఆసుపత్రి 16వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, క్యాన్సర్ వ్యాధి బారిన పడి, ఆపై పోరాడి గెలిచిన పలువురిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ఆసుపత్రి అందిస్తున్న సేవలను తెలంగాణ ప్రభుత్వం గుర్తించిందని, తారతమ్యం లేకుండా అన్ని వర్గాల వారికీ అత్యున్నత స్థాయి వైద్య సేవలను అందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News