: అద్భుతం... 25 అడుగుల ఎత్తునుంచి కిందపడినా స్వల్ప గాయాలతో బయటపడిన చిన్నారి


రెండంతస్తుల పైనుంచి కిందపడితే ఏమవుతుంది. ఎముకలు నుజ్జు నుజ్జు అవుతాయి. క్షణాల్లోనే ప్రాణం పోతుంది. కానీ ఆశ్చర్యకరంగా ఓ చిన్నారి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడింది. ఆమెను చూసిన వైద్యులే ఆశ్చర్యపోతున్నారు. బెంగళూరులో జరిగిందీ ఘటన. 19 నెలల తనీషా తన ఇంటిలోని బాల్కనీ నుంచి ప్రమాదవశాత్తు కిందపడింది. కింద అచేతనంగా పడి ఉన్న పాపను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు తనీషా ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదని, తలపై చిన్నగాయం అయిందని చెప్పడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. 25 అడుగుల ఎత్తునుంచి కిందపడిన చిన్నారి ప్రాణాలతో బయటపడడం అద్భుతమని ఆమెకు వైద్యం చేసిన పీపుల్ ట్రీ ఆస్పత్రి వైద్యుడు సుమన్ చెప్పారు. శరీరంపై ఆమెకు ఎటువంటి గాయాలు లేవని, పుర్రె భాగంలో చిన్న గాయం అయితే సర్జరీ చేశామని వివరించారు. పాప కిందపడిందన్న వార్త తెలిసి ఒక్కసారిగా తన గుండె ఆగిపోయినంత పనయిందని, అయితే స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి ఆమె తప్పించుకున్నట్టు ఆస్పత్రికి వెళ్లాక తెలిసిందని తనీషా తండ్రి మహేంద్ర ఆనందంగా చెప్పారు.

  • Loading...

More Telugu News