: హామీలను నిలబెట్టుకుంటున్నాం, రుణమాఫీ చేస్తున్నాం: ప్రత్తిపాటి పుల్లారావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఒంగోలులో రెండో విడత రుణ ఉపశమన పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఏనాడూ, ఏ నాయకుడూ చేయలేని విధంగా చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తున్నారని ఆయన అన్నారు. విభజన తరువాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నా అధిక మొత్తంలో రైతు రుణమాఫీ చేస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దాలన్నదే చంద్రబాబు ఆశయమని ఆయన అన్నారు. చంద్రబాబు నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చి తీరుతారని ఆయన ఉద్ఘాటించారు.