: దీక్ష విరమణకు ముద్రగడ కొత్త షరతులు... అంగీకరించని బాబు సర్కారు


తుని ఘటనలో బాధ్యులంటూ, పోలీసులు జైల్లో పెట్టిన కాపు కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసి తన పంతం నెగ్గించుకున్న ముద్రగడ పద్మనాభం, దీక్ష విరమణకు పెట్టిన షరతులను చంద్రబాబు సర్కారు తిరస్కరించింది. తనను, జైలు నుంచి విడుదలైన 13 మందినీ పోలీసు వ్యాన్ లో కిర్లంపూడికి తీసుకువెళ్లాలని, అక్కడికి కలెక్టర్, ఎస్పీలు వచ్చి నిమ్మరసం ఇవ్వాలని ముద్రగడ షరతులు పెట్టగా, అలా చేసే సమస్యే లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ ఆయన షరతులను అంగీకరించామని, కొత్త వాటిని ఒప్పుకోబోమని స్పష్టం చేసిన ప్రభుత్వం, ఇక దీక్ష విరమించి ఇంటికి వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వం జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని సమాచారం.

  • Loading...

More Telugu News