: తెలంగాణలో బీర్లు పారించారు... దక్షిణాదిలో బీరు వినియోగంలో తెలంగాణ టాప్!


రికార్డు స్థాయిలో బీర్ లు విక్రయించిన తెలంగాణ... దక్షిణాది రాష్ట్రాల్లో అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో బీర్ల విక్రయాలు ఏ స్థాయిలో జరిగాయంటే... ద్వితీయ స్థానంలో ఉన్న కేరళలో అమ్ముడైన బీర్ లకు రెట్టింపు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో 334.56 లక్షల కేసుల బీర్లలను తెలంగాణలో గుటకాయ స్వాహా చేశారు. దీంతో తెలంగాణలో సగటున మనిషి 7.48 లీటర్ల బీరును తాగినట్టు అర్థమవుతోంది. ఇదే సమయంలో ద్వితీయ స్థానంలో నిలిచిన కేరళలో సగటున మనిషి 3.64 లీటర్ల మేరకు బీరు తాగాడని గణాంకాలు చెబుతున్నాయి. మూడో స్థానంలో కన్నడిగులు నిలవగా, ఆంధ్రులు మాత్రం తామేం తక్కువా అన్నట్టు సగటున 2.72 లీటర్లు స్వాహా చేసి నాలుగో స్థానంలో నిలిచారు. ఊహించని స్థాయిలో జరిగిన బీర్ల అమ్మకాలను చూసిన అధికారులు ఆశ్చర్యపోతున్నారు. ఎండల తీవ్రత బీర్లపై మోజు పెంచిందని సరిపెట్టుకుంటున్నారు. మద్యం విక్రయాలలో కర్ణాటక సగటున 8.23 లీటర్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మద్యం విక్రయాల్లో కర్ణాటకే నెంబర్ వన్ గా నిలిచింది. తమిళనాడు దాని తరువాతి స్థానంలో 6.82 లీటర్ల సగటుతో నిలిచింది. మద్యం అమ్మకాల్లో 6 లీటర్ల సగటుతో తెలంగాణ మూడో స్థానం దక్కించుకుంది. నాలుగోస్థానంలో ఏపీ 5.47 లీటర్ల సగటుతో నిలిచింది. మద్యం విక్రయాలపై ఆంక్షలతో బీర్ల అమ్మకాల్లో రెండో స్థానంలో నిలిచిన కేరళ మద్యం విక్రయాల్లో మాత్రం చివరిస్థానంలో నిలిచింది.

  • Loading...

More Telugu News