: గుంటూరు జీజీహెచ్‌లో బాలిక ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన యువ‌కుడు.. దేహ‌శుద్ధి


గుంటూరు జీజీహెచ్‌లో ఓ బాలిక ప‌ట్ల ఓ కామాంధ‌ యువ‌కుడు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఒక్క‌సారిగా అక్క‌డున్న ఓ బాలికను లైంగికంగా వేధించ‌డానికి ప్ర‌య‌త్నించాడు. బాలిక కేక‌లు వేయ‌డంతో స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని, యువ‌కుడిని పట్టుకొని దేహ‌శుద్ధి చేశారు. నిందితుడు పాత గుంటూరు వాసిగా స్థానికులు గుర్తించారు. నిందితుడు గతంలోనూ బాలిక‌లు, యువ‌తుల ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయని స్థానికులు తెలిపారు. నిందితుడ్ని పోలీసుల‌కి అప్ప‌గించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News