: అర్ధరాత్రి సమయంలో 'డ్రోన్'తో ఆటలు... తమిళ సినీ నటుడి కుమారుడు అరెస్టు
చెన్నైలోని సీఐటీ నగర్ లో అర్ధరాత్రి సమయంలో డ్రోన్ ను ఎగరేసినందుకు తమిళ సినీ నటుడు పాండ్య రాజన్ కుమారుడు ప్రేమ రాజన్ ను పోలీసులు అరెస్టు చేశారు. బీచెస్ వేల్స్ అవెన్యూ ప్రాంతంలో అర్ధరాత్రి సమయంలో ఈ డ్రోన్ ఎగురుతుండటాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మైలాపురం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. తన స్నేహితులతో కలిసి దీనిని ఎగరేసినట్టు ప్రేమ రాజన్ చెప్పడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు.