: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడినీ వదలని సీబీఐ


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ ను గంటల తరబడి ప్రశ్నించిన సీబీఐ అధికారులు, ఆయన కుమారుడు విక్రమాదిత్య సింగ్ ను కూడా వదలడం లేదు. తండ్రి అవినీతిలో కుమారుడి భాగం ఎంతో తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. గంటల తరబడిసాగిన ఈ విచారణలో ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. కాగా, వీరభద్ర సింగ్ ను పలు సందర్భాల్లో విచారించిన సీబీఐకి తన అస్తులు ఎలా వచ్చాయో చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదని, వయసు మీరడం వల్ల మర్చిపోయానని ఆయన గతంలో తెలిపినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News