: దుమ్ముదులిపేస్తోన్న ‘మొహెంజొదారో’ ట్రైలర్‌


అశుతోష్‌ గోవారికర్ దర్శకత్వంలో హృతిక్‌ రోషన్ హీరోగా బాలీవుడ్‌లో రూపుదిద్దుకుంటోన్న‌ చిత్రం ‘మొహెంజొదారో’. పీరియాడిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం టైల‌ర్ ను నిన్న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. చిత్ర ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన వ‌స్తోంది. అత్య‌ధిక‌ వ్యూస్‌తో దుమ్ముదులిపేస్తోంది. స్టార్‌ టీవీనెట్‌వర్క్స్‌ ద్వారా విడుదల చేసిన ‘మొహెంజొదారో’ చిత్రానికి ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఛానెల్స్‌ ద్వారా 30 మిలియన్ల వ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమాలో హృతిక్ స‌ర‌స‌న పూజా హెగ్డే న‌టిస్తోంది. ఏ.ఆర్‌ రెహమాన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 12న విడుద‌ల చేయ‌నున్నారు. బుజ్‌, ముంబయి, జబల్‌పూర్‌, థానేల్లోని లొకేషన్లో షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో హృతిక్ రోష‌న్ ర‌ఫ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు.

  • Loading...

More Telugu News