: డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం... అమెరికాలో కలకలం!


అమెరికాలో పెను కలకలం. రిపబ్లికన్ల తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ పై ఓ బ్రిటన్ యువకుడు హత్యాయత్నం చేశాడు. 19 ఏళ్ల మైఖేల్ స్టాన్ ఫోర్డ్, ఓ పోలీసు వద్ద ఉన్న తుపాకిని లాక్కొని ట్రంప్ పై కాల్పులు జరపబోయాడు. లాస్ వెగాస్ సమీపంలోని ట్రెజర్ ఐలాండ్ కాసినో వద్ద ట్రంప్ ఓ ర్యాలీని నిర్వహిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. మైఖేల్ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని విచారించగా, అతను చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు. తాను ఎన్నడూ తుపాకీని వాడలేదని, తనను భద్రతాదళాలు చంపుతాయని తెలుసునని చెప్పాడు. ఒకవేళ, ఇక్కడ విఫలమైతే, ఆపై ఫినిక్స్ లో ట్రంప్ ర్యాలీలో పాల్గొని చంపేందుకు ప్లాన్ వేశానని తెలిపాడు. బ్రిటన్ ఎంబసీ సాయంతో మైఖేల్ ను పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News