: విశాఖకు పాకిన ‘రేసింగ్’ పిచ్చి!... ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం?


హైదరాబాదులో యువతను వెర్రెత్తిస్తున్న బైక్ రేసింగ్ లు తాజాగా సాగర నగరం విశాఖకు పాకాయి. నగరంలోని యువత వీకెండ్ లలో పెద్ద సంఖ్యలో ఓ దరి చేరి ఖరీదైన బైకులతో ఝుమ్మంటూ దూసుకెళుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి సాగుతున్న ఈ రేసింగుల్లో ప్రమాదాలు కూడా చోటుచేసుంటున్నాయి. మొన్న రాత్రి నగరంలో నిర్వహించిన రేసింగుల్లో జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడినట్లు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. ఇద్దరు మరణించిన ఈ ప్రమాదంలో చాలా మంది యువకులు గాయపడ్డారని తెలుస్తోంది. సమాచారం అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు నోరు మెదిపేందుకు మాత్రం జంకుతున్నారు. నగరంలోని రిషికొండ ఐటీ పార్క్ వేదికగా ఈ రేసులు సాగినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News